ఎంతరేటు పెరిగిందీ
దేశంలో పెద్ద ఉల్లి !
కంటనీరు పెడుతోందీ
వంటింట్లో ప్రతి తల్లీ !!
ఉల్లిఘాటు తగలనుంది
కేంద్రప్రభుత్వానికి !
ధరలు నియంత్రించలేని
అసమర్ధత్వానికి !!
చంకలోన ఉల్లిపెడితె
వస్తుందంటా జ్వరం !
మంటపుడితె మారుతుంది
సామాన్యుడి ఓటు స్వరం !!
పిచ్చ ఉల్లి దేముందని
చూడకండి చిన్న చూపు !
కామన్ మ్యాను చేతి దెబ్బ
అధికారపు టాపు లేపు !!
– ఏవీయస్