రాజధాని రహదారికి
ప్రపంచాన లేదు సాటి !
గతుకుల్లో గుంటల్లో
మనమేనట ఘనాపాటి !
మృత్యువుకిది షార్ట్ కట్టు
ప్రతినిత్యం గుండె దడ !
చావెక్కడ రాసుందో
తెలియదు నీ బండబడ !!
ఇంట బయలుదేరినోళ్ళు
తిరిగొచ్చేవరకు డౌటు !
ఆయువు లేకుంటే మాత్రం
వెలుగుతుంది చావులైటు !!
సర్కారుకు లెక్కలేదు
రహదారుల మరమ్మత్తు !
నగరజనం అదోటైపు
మీకుండదు భవిష్యత్తు !!
– ఏవీయస్