హమ్మయ్య… బతికాం….
శాసనసభ లో రగడట
అవిశ్వాస తీర్మానం !
కాంగ్రెస్సుకు మరోసారి
రాజకీయ నిర్మాణం !!
వైకాపా తెరాసాల
వ్యక్తిగత స్వార్ధం !
విమర్శించినాడు బాబు
బేరాలే పరమార్ధం !!
బతికిందట కిరణు ప్రభుత
చావు తప్పి కన్ను లొట్ట...
మేలిమి బంగారం…..
అఖిలభారతాన నటుడిగ
తారకరాముడు బెస్టూ !
గర్వంతో ఉప్పొంగిన
తెలుగువాడి చెస్టూ !!
వెండితెరకు దేవుడతడు
సాటిలేని తెలుగువాడు !
నటన సార్వభౌముడతడు
తిరుగులేని వెలుగు రేడు !!
రాముడైన కృష్ణుడైన
ఇలాగనే వుంటారట !
వేల్పులు సైతం ఇతడిని...
బ్రహ్మచారీ జిందాబాద్…
పెళ్లి పదవి వద్దంటూ
రాహుల్ గాంధి డెసిషన్ !
బ్రహ్మచారిగానె బెటరు
ఉండదు ఇక ఏ టెన్షన్ !!
పార్టీ ప్రక్షాళనంటూ
త్యాగ భరిత ప్రస్తానం !
రాజకీయ మెలోడ్రామ
పదిలమయ్య నీ స్థానం !!
నలభయ్యో పడిలో...
కాలు జాగ్రత్త !
షర్మిలమ్మ పాదయాత్ర
జగనుకిదో టాబ్లెట్టూ !
నోరు తెరిస్తే తిట్లూ
చంద్రబాబె టార్గెట్టూ !!
జంపు జిలానీలకిదో
రాజకీయ రహదారీ !
నైతిక విలువలు మాత్రం
బహుదూరం పరారీ !!
గోడదూకు యోధులతో...
శ్రీశ్రీశ్రీ చిదంబరానంద !
మన్మోహన బడ్జెట్టని
పొగిడినాడు సింగుగారు !
అంత సోకు ఏముందని
అడుగుతోంది ప్రతినోరు !!
నెప్పి తెలియకుండా మరి
వచ్చును రూపాయి రాక !
చిదంబరం సాగరమిది
సామాన్యుడి జీవనౌక !!
సబ్జెక్టే లేనప్పుడు...
కలుగుల్లోకి పోదాం రండి…..
భాగ్యనగరి గుండె మీద
ఉగ్రవాద నృత్యం !
ముష్కర మూకలకెపుడూ
హింస నిత్యకృత్యం !!
భాగమతీ నుదుటిమీద
జన నెత్తుటి సింధూరం !
హైద్రబాదు ఆసాంతం
తీవ్రవాద ప్రాకారం !!
అలసత్వం పెరిగినపుడు
మారణహోమం షురూ !
పుడుతూనే వుంటారోయ్
కసబ్బు...
పెట్రోలై మండుతోంది !
మరోసారి పెరిగినాయి
పెట్రోలూ డీజెలూ !
డిల్లీ నేతల చేతికి
వేసేద్దాం గాజులూ !!
సగటుజీవి నడ్డి మీద
ఇంకోసారి బరువూ !
ఇది అరణ్య రోదనంట
వినేవాడు కరువూ !!
పెంచుతునే పొండయ్యా
ప్రశ్నించే వాడు లేడు...
సిగ్గూ ఎగ్గూ జాన్తా నై !
తాజాగా బైటపడిన
మరో స్కాము అగస్టా !
ఓ మైగాడ్ అధికారం
మరీ ఇంత వరస్టా !!
అవినీతి తొ మురికిపట్టి
నల్లబడ్డ నా దేశం !
జనం ఖర్మ ఇంతేలే
తొక్కిపట్టు ఆవేశం !!
నిత్యకృత్య మీ...
వాపు అలియాస్ బలుపు
సహకారం సక్సెసుతో
ముఖ్యమంత్రి సంతోషం !
వాపు కాదు బలుపంటూ
జనావళికి సందేశం !!
రైతుల మద్దతు తమకని
కిరణ్ గారి ధీమా !
వస్తుందట ఇకమీదట
ఆత్మహత్యలకు కామా !!
ఎన్నికలే పరమార్ధం
కాకూడదు ఓ సీయం...
‘ ఉల్లీ ‘శ్వరి
ఎంతరేటు పెరిగిందీ
దేశంలో పెద్ద ఉల్లి !
కంటనీరు పెడుతోందీ
వంటింట్లో ప్రతి తల్లీ !!
ఉల్లిఘాటు తగలనుంది
కేంద్రప్రభుత్వానికి !
ధరలు నియంత్రించలేని
అసమర్ధత్వానికి !!
చంకలోన ఉల్లిపెడితె
వస్తుందంటా జ్వరం !
మంటపుడితె మారుతుంది
సామాన్యుడి...