Site icon TeluguMirchi.com

కోతి చేష్టలు

లేదట పాకిస్తాను కు
సిగ్గు శరము ఏ మాత్రం !
నిరంతరం కవ్వింపే
తీవ్రవాద సూత్రం !!

సరిహద్దుల్లోన లొల్లి
జవాన్ల ప్రాణాలు బలి !
ఎదుర్కొన్న భారతీయ
యోధుల త్యాగాలు భళీ !!

మంచుకొండ గుళ్ళల్లో
సైనిక పూజారులు !
శత్రుమూక గుండెల్లో
వెచ్చటి కైజారులు !!

భారతమ్మ చిరునవ్వును
చెరిపారో ఖబడ్దార్ !
మాతృదేశ రక్షణలో
ప్రతివ్యక్తీ ఓ సర్దార్ !!!

– ఏవీయస్

Exit mobile version