కన్నీటి కాపురం !

పొంగిన గోదారి కృష్ణ
ఊళ్ళ మీద విహారం !
తట్టబుట్ట సర్దుకున్న
సామాన్యుడి వ్యవహారం !!

నడుము లోతు నీటిలోన
పల్లెజనం బతుకూ !
నీళ్ళ పొయ్యి మీద ఎలా
ఉడుకుతుంది మెతుకూ !!

ఆదుకునేవాడు లేడు
అధికారులు బిజీ బిజీ !
ఎలెక్షన్లు ముఖ్యమంట
పోలింగుల గజి బిజీ !!

జనం గోడు పట్టదంట
ఎవడికుంది తీరిక !
అలసిన నాయకులకింక
ఎక్కడుంది ఓపిక !!

– ఏవీయస్