Site icon TeluguMirchi.com

హమ్మయ్య… బతికాం….

శాసనసభ లో రగడట
అవిశ్వాస తీర్మానం !
కాంగ్రెస్సుకు మరోసారి
రాజకీయ నిర్మాణం !!

వైకాపా తెరాసాల
వ్యక్తిగత స్వార్ధం !
విమర్శించినాడు బాబు
బేరాలే పరమార్ధం !!

బతికిందట కిరణు ప్రభుత
చావు తప్పి కన్ను లొట్ట !
బొటా బొటీ ఫిగర్లతో
దాటలేవు కరకట్ట !!

చుట్టూ శత్రువులుంటే
యుద్ధవిజయ మతి కష్టం !
ముళ్ళ మీద పరిగెడితే
గమ్యం ఒక ముదనష్టం !!

– ఏవీయస్

Exit mobile version