బంగారం కొనొద్దంటు
చిదంబరం సలహా !
గోల్డు హాలిడే ఇమ్మను
విత్తమంత్రి తరహా !!
రేటు తగ్గిపోయిందని
బంగరు కొట్లకు వరద !
రూపాయ్ పడిపోయిందంటే
ఖజానాకు బెడద !!
పెళ్ళీ శోభనమూ కూడా
పోస్టుపోను ఏడాదీ !
స్వర్ణం కొన్నప్పుడె మనకిక
బంగారపు ఉగాదీ !!
కట్నాల్లో నగలు లేవు
కనకం కనుమరుగే ఇక !
గోల్డే తెలియని బడుగులు
నవ్వారట పక పక !!
– ఏవీయస్