రగులుతోంది సీమాంధ్రా
విభజన వద్దే వద్దని !
సమధర్మం లేకుంటే
శాంతి భద్రతలు రద్దని !!
కొట్టుకు చస్తున్నారట
అన్నదమ్ములిద్దరూ !
చోద్యం గమనిస్తోందట
కాంగిరేసు ఖద్దరూ !!
ఏ ప్రాంతం వారికైన
మనోభావమే ముఖ్యం !
సమభావం లేకుంటే
ఉండదు ఇకపై సఖ్యం !!
కమిటీలెందుకు భయ్యా
కమిట్ మెంట్ కావాలి !
బిల్డప్పులు వద్దయ్యా
మంచి తీర్పు రావాలి !!
– ఏవీయస్