పెళ్లి పదవి వద్దంటూ
రాహుల్ గాంధి డెసిషన్ !
బ్రహ్మచారిగానె బెటరు
ఉండదు ఇక ఏ టెన్షన్ !!
పార్టీ ప్రక్షాళనంటూ
త్యాగ భరిత ప్రస్తానం !
రాజకీయ మెలోడ్రామ
పదిలమయ్య నీ స్థానం !!
నలభయ్యో పడిలో మరి
పెళ్లికడ్డు గోడలూ !
కనపడదేమో మనకిక
సోనియమ్మ కోడలూ !!
వారసులుండక పోతే
ఎలా గాంధి కుటుంబం !
భరత రాజకీయాలకు
ఇందిరమ్మ కదంబం !!
– ఏవీయస్