మరోసారి పెరిగినాయి
పెట్రోలూ డీజెలూ !
డిల్లీ నేతల చేతికి
వేసేద్దాం గాజులూ !!
సగటుజీవి నడ్డి మీద
ఇంకోసారి బరువూ !
ఇది అరణ్య రోదనంట
వినేవాడు కరువూ !!
పెంచుతునే పొండయ్యా
ప్రశ్నించే వాడు లేడు !
ప్రజలగోడు పట్టనపుడు
ప్రభుతకాదు వల్లకాడు !!
జనానికిక పంచండీ
ఎడ్లబళ్ళు, సైకిళ్ళూ !
ఫ్యూయల్ కష్టాలు లేని
మిడిల్ క్లాసు లోగిళ్ళూ !!
– ఏవీయస్