Telangana Elections 2023 : తెలంగాణలో ముగిసిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ లెక్క ఇదే..


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల లోపు క్యూలో నిలబడిన వారికి ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 63.94 శాతం ఓటింగ్ నమోదైంది. అనంతరం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందని పలు సంస్థలు పేర్కొన్నాయి. ఎగ్జిట్‌ పోల్స్ ఇలా ఉంటే.. ఫలితాలు తేలాలంటే డిసెంబర్‌ 3 వరకు ఆగాల్సిందే.

AGENCYINCBRSBJPAIMIMOTHERS
సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌56481050
న్యూస్‌ 18 ఎగ్జిట్ పోల్స్‌56481050
ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌58-6741-495-707-9
అగ్ని న్యూస్‌ ఎగ్జిట్ పోల్స్62-6643-472-55-70
సునీల్‌ వీర్‌ అండ్‌ టీమ్‌ ఎగ్జిట్‌పోల్స్‌2868-7210-1160
సీ-ప్యాక్ తెలంగాణ ఎగ్జిట్ పోల్స్6541409
పల్స్ టుడే ఎగ్జిట్‌ పోల్స్37-3869-7103-050601
చాణక్య స్ట్రాటజీస్67-7822-3006-0906-0700