వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఫోన్ నెంబర్లను సేవ్ చేసుకోవాలంటే కేవలం ఓ క్యూర్ కోడ్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది. వారి నెంబరు, పేరు సహా కాంటాక్టుల జాబితాలో నిక్షిప్తం అవుతాయి.
ఇప్పటివరకు, కాంటాక్టు లిస్టుకు నెంబర్లు ఫీడ్ చేయాలంటే, కీప్యాడ్ ఓపెన్ చేసి నెంబరు టైప్ చేసి, పేరు టైప్ చేసి ఆపై సేవ్ చేయాలి. ఈ క్రమంలో కొన్నిసార్లు ఫోన్ నెంబర్లు తప్పుగా టైప్ చేయడమో, లేక పేర్లు తప్పుగా టైప్ చేయడమో జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో సరికొత్త ఫీచర్ తో యూజర్ల పని ఎంతో సులువు కానుంది.