పేటీఎం మారనున్న వాట్సప్‌

Whatsapp-riskప్రపంచంలో అత్యధికు వాడుతున్న మెసెంజర్‌ వాట్సప్‌. ముఖ్యంగా భారతదేశంలో వాట్సప్‌ను ఏ స్థాయిలో వాడుతున్నారో చిన్నా పెద్ద ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు. ప్రతి భారతీయుడు స్మార్ట్‌ ఫోన్‌లో వాట్సప్‌ను చూడవచ్చు. దేశ వ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతున్న వాట్సప్‌ను వినియోగదారులకు మరింత ఉపయోగదాయకంగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వాట్సప్‌కు సంబంధించిన పలు కీలక మార్పులు చేర్పు చేయడం జరిగింది.

ఇక వాట్సప్‌ త్వరలోనే పేటీఎం తరహాలో నగదు రహిత సేవలను అందించబోతుంది. అందుకోసం వాట్సప్‌ యాజమాన్యం సిద్దం అవుతుంది. ప్రపంచంలో మొదటిసారి ఇండియాలోని వాట్సప్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపు పక్రియను ప్రారంభించాలని సదరు కంపెనీ వారు భావిస్తున్నారు. ఇందుకోసం భీమ్‌, ఆధార్‌ పే, యూపీఐ యాప్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులు వాట్సప్‌లో కొత్తగా రాబోతున్న డిజిటల్‌ పేమెంట్స్‌ డెవపింగ్‌ చేయాల్సిందిగా వాట్సప్‌ పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు భారీ స్పందన వచ్చింది. మరో ఆరు నెలలో ఇండియాలో వాట్సప్‌ డిజిటల్‌ చెల్లింపుల పక్రియ మొదలవుతుందని తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే ఇతర యాప్స్‌ అన్ని కూడా మూసుకోవాల్సిందే అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.