వాహన తయారీ సంస్థలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వోల్వో..తాజాగా ఎస్60 పోల్‌స్టార్‌ను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.52.50 లక్షలు (ఎక్స్‌షోరూం, దిల్లీ) నిర్ణయించింది. వేగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ విభాగంలో ఇది తొలి వాహనమని కంపెనీ తెలిపింది.
కేవలం 4.7 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు, గంటకు గరిష్ఠంగా 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 2.0 లీటర్ల ట్విన్ ఛార్జ్డ్ (టర్బో ఛార్జ్డ్, సూపర్ ఛార్జ్డ్) పెట్రోలు ఇంజిన్‌ను ఈ కారుకు అమర్చారు. ఎస్60 పోల్‌స్టార్‌ను విడుదల చేయడం ద్వారా ఖరీదైన కార్ల విభాగంలో అన్ని రకాల వాహనాలను తాము తీసుకొచ్చినట్లు అయిందని వోల్వో తెలిపింది.