జియో సంచలనం తరువాత చాల టెలికం సంస్థలు దివాళా తీశాయి. కొన్ని సంస్థలు వ్యాపారం చేయలేక ప్రస్తుత ట్రేండింగ్ లో ఉన్న వాటిలోకి కలసి పోయాయి. ఇప్పుడు ఐడియా, వోడాఫోన్ ఒక్కటయ్యాయి. ఇది ఎప్పటి నుంచో అనుకున్న దానికి ఈ రోజు కార్యరూపం దాల్చింది. ఈ రెండు టెలికాం సంస్థలును ఇక నుంచి వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ పేరుతో పిలవనున్నారు.
భారత్‌లో అత్యంత పెద్ద టెలికం సర్వీస్ ప్రొవైడర్‌గా వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ నిలిచింది. ఈ రెండు కంపెనీలకు 408 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. విలీనమైన తర్వాత కొత్త బోర్డును ఏర్పాట్లు చేసినట్లు రెండు కంపెనీలు పేర్కొన్నాయి. వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ కంపెనీలో మొత్తం 12 మంది డైరక్టర్లు ఉంటారు. ఈ కంపెనీకి కుమార మంగళం బిర్లా చైర్మన్‌గా ఉంటారు. సీఈవోగా బాలేశ్ శర్మ బాధ్యతలు నిర్వర్తిస్తారు. మరి ఇప్పుడు వీటి కలయిక వల్ల జియో ఏమిచేస్తుందో.