రిలయన్స్ జియో ను ఎదురు దెబ్బ తీయడానికి అన్ని టెలికం సంస్థలు ఏకకాలం లో దాడి కి దిగాయి.. ఇటీవల జియో తీసుకొచ్చిన ‘ధన్ ధనాధన్’కు తలదన్నే విధంగా అన్ని సంస్థలు సరికొత్త ఆఫర్స్ ను ప్రకటించి కస్టమర్లను కాపాడుకునేందుకు రెడీ అయ్యాయి..ఇక ఆ ఆఫర్స్ ఏంటో మీరే చూడండి..
వొడాఫోన్ :
రూ.352: వొడాఫోన్ ప్రవేశపెట్టిన రూ.352తో రీఛార్జి చేసుకుంటే 56 రోజులపాటు రోజుకి 1జీబీ డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఉచితకాల్స్ మాట్లాడుకోవచ్చు.
ఎయిర్‌టెల్ :
రూ.244: దీంతో రీఛార్జి చేసుకుంటే 70రోజులపాటు రోజుకు 1జీబీ డేటాతోపాటు ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కి రోజుకి 300 ఉచిత నిమిషాలు.. వారానికి 1200 ఉచిత నిమిషాలు పొందవచ్చు. ఆ తరువాత నిమిషానికి 10పైసల చొప్పున వసూలు చేస్తారు. 4జీ హ్యాండ్‌సెట్ వాళ్లకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
రూ.399: ఈ ప్యాక్ కింద 70రోజుల పాటు రోజుకి 1జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు 3వేల ఉచిత నిమిషాలు పొందవచ్చు. ఉచిత నిమిషాల తరువాత నిమిషానికి 10పైసలు వసూలు చేస్తారు. ఎయిర్‌టెల్ పరిధిలో రోజుకు 300, వారానికి 1200 ఉచిత నిమిషాలు లభిస్తాయి. 4జీ హ్యాండ్‌సెట్ వాళ్లకి మాత్రమే ఇది వర్తిస్తుంది.
రూ.345: ఈ ఆఫర్ కింద రోజుకు 2జీబీ డేటాతో పాటు, ఉచిత కాల్స్ విషయంలో రూ.399కి ఉన్న ఆఫర్లు దీనికీ వర్తిస్తాయి.
ఐడియా :
రూ.297: ఐడియా కొత్త ఆఫర్లో భాగంగా రూ.297తో రీఛార్జి చేస్తే 70రోజులపాటు రోజుకి 1జీబీ డేటా, సొంత నెట్‌వర్క్‌కి రోజుకి 300, వారానికి 1200 ఉచిత నిమిషాలు లభిస్తాయి. ఉచిత నిమిషాల తరువాత నిమిషానికి 30పైసలు వసూలు చేస్తారు.
దీనికి 4జీ హ్యాండ్‌సెట్ తప్పనిసరి.
రూ.447: ఐడియా ప్రవేశపెట్టిన మరో రీఛార్జి రూ. 447. దీంతో 70 రోజులపాటు రోజుకి 1జీబీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు 3000 ఉచిత నిమిషాలు పొందవచ్చు. ఉచిత నిమిషాల తరువాత ఇతర నెట్‌వర్క్‌లకు నిమిషానికి 30పైసలు వసూలు చేస్తారు. సొంత నెట్‌వర్క్‌కి రోజుకు 300 వరకు వారానికి 1200 ఉచిత నిమిషాలు లభిస్తాయి.