విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థకు ఎనిమిది వారాలపాటు స్పైస్‌జెట్ విమానాలను 50% మాత్రమే నడపాలంటూ డీజీసీఏ ఆంక్షలు విధించింది. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఈ చర్యలు చేపట్టింది. ‘‘తక్షణ తనిఖీలు, దర్యాప్తులు, ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల అనంతరం సురక్షితమైన, నమ్మదగిన విమాన సేవలను కొనసాగించేందుకు.. స్పైస్‌జెట్ విమాన సర్వీసుల సంఖ్యను 8 వారాలపాటు 50%కి పరిమితం చేస్తున్నాం’’అని DGCA ఓ ప్రకటనలో తెలిపింది.