ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల దిగ్గజం శామ్‌సంగ్..మార్కెట్లోకి మరోసారి తన సరికొత్త మోడల్ తో ఆకర్షించడానికి రెడీ అయ్యింది..గెలాక్సీ 8, 8ప్లస్ మోడళ్లను ఈనెల 19న భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు శామ్‌సంగ్ తెలిపింది. ఈ మోడల్స్ ను దక్కించుకోవాలనుకునే వారు ఇప్పటికే ఆన్లైన్ లో రిజిస్టర్ తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు.
గెలాక్సీ 8 ధర రూ.48,700, గెలాక్సీ 8ప్లస్ రూ.55,200గా ఉండవచ్చని సమాచారం. వీటిలో ఒక సిమ్ మాత్రమే వేసుకునే సౌకర్యం ఉంది. గెలాక్సీ, గెలాక్సీ 8ప్లస్.. రెండూ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ వెర్షన్‌లో ఉంబోతున్నాయి..గెలాక్సీ 8, 8ప్లస్ తేడాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి..
గెలాక్సీ 8 ఫీచర్లు :
* 5.8 అంగుళాల డిస్‌ప్లే
* 1.9 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 8 ఎంపీ ఫ్రంట్, 12 ఎంపీ బ్యాక్ కెమెరా
* 4జీబీ రామ్, 64జీబీ అంతర్గత మెమొరీ
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం.
గెలాక్సీ 8 ప్లస్ ఫీచర్లు :
* 6.2 అంగుళాల డిస్‌ప్లే
* 1.9 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 4జీబీ ర్యామ్, 64జీబీ అంతర్గత మెమొరీ
* 8 ఎంపీ ఫ్రంట్, 12 ఎంపీ బ్యాక్ కెమెరా
* 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం.