ఒప్పో, వన్ ప్లస్ ఫోన్ల పై నిషేధం


ఒప్పో, వన్ ఫ్లస్ ఫోన్లకు ఎదురు దెబ్బ తగిలింది. న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటుంది. దీంతో వన్‌ప్లస్‌, ఒప్పో బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలను జర్మనీ నిషేధించింది. ఈ నిషేధానికి కారణం ఈ రెండు కంపెనీల పై పేటెంట్ దొంగతనం కేసు. వైర్‌లెస్ టెక్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ఇంటర్‌డిజిటల్ ప్రకారం.. ఒప్పో, వన్‌ప్లస్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 5జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగానే వన్ ప్లస్, ఒప్పో స్మార్ట్ ఫోన్లను జర్మనీ నిషేధించింది. విశేషమేమిటంటే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా చైనీస్ కంపెనీకి చెందిన రెండు బ్రాండ్‌లు. ఇది చైనాతో పాటు అనేక ప్రపంచ మార్కెట్‌లలో తన స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తుంది. వారికి ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి మంచి మార్కెట్ వాటా ఉంది.