జియో సర్ప్రైజ్ సిక్సర్… జియో యుజర్లందరికి హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితం

రిలయన్స్ జియో యూజర్లకి శుభవార్త. రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సారి ఇది క్రికెట్ అభిమానుల కోసం. అదేంటంటే… ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచులు ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మ్యాచులను చూసేందుకు క్రికెట్ సీజన్ డేటా రూ.251 రీఛార్జి చేసుకుంటే చాలు. వరల్డ్ కప్ మ్యాచులను ఉచితంగా చుసేయవచ్చు. దీనితో పాటు జియో యూజర్లు రూ.365 విలువైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా జియో టీవీ యాప్ నుండి హాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్ చూసే అవకాసం ఉంటుంది.

ఇక డేటా రీఛార్జి విషయానికి వస్తే… రూ.251 జియో క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రీఛార్జి చేసుకుంటే 51 రోజుల పాటు రోజుకి 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. దీనితో పాటు మ్యాచులు జరుగుతున్నంతకాలం జియో పోటీలు నిర్వహిస్తుంది. అందులో గెలుపొందితే ప్రత్యేక బహుమతులు ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం చేసేయండి… జియో సిక్సర్…