భారత టెలికాం రంగంను ఒక కుదుపు కుదిపిన రిలయన్స్ జియో సంచలనాలకు మారు పేరుగా నిలిచింది. ఉచిత కాల్స్ మరియు అపరిమిత డేటా అంటూ ఆరు నెలల పాటు వినియోగదారులను తన చుట్టూ తిప్పుకున్న జియో ఫ్రీ ఆర్స్ నేటితో ముగియనున్నాయి. ఉచిత ఆఫర్స్‌తో ఏకంగా 10 కోట్ల మంది వినియోగదారులను అతి తక్కువ సమయంలో పొందిన జియోకు అయిదు కోట్ల మంది వినియోగదారులు షాక్ ఇచ్చారు. ఈ ఆరు నెలల పాటు ఉచిత డేటా మరియు కాల్స్‌ను అనుభవించిన వినియోగదారులు ఇప్పుడు జియోను పక్కకు పడేయబోతున్నారు.
ఉచిత ఆఫర్స్ ముగుస్తున్న నేపథ్యంలో జియో ఫ్రైమ్‌మెంబర్ షిప్ అంటూ 99 రూపాయలతో రీచార్స్ చేసుకోవాల్సిందిగా జియో ప్రకటించింది. అయితే నేటితో గడువు ముగుస్తున్నా కూడా ఇప్పటి వరకు కేవలం అయిదు కోట్ల మంది మాత్రమే జియో మెంబర్ షిప్‌ను తీసుకోవడం జరిగింది. అంటే మిగిలిన ఆ అయిదు కోట్ల మంది జియోను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే నిజం అయితే జియోకు పెద్ద ఎదురు దెబ్బె అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇతర టెలికాం సంస్థలు కూడా అతి తక్కువ రేటుకు డేటాను ఇస్తున్న నేపథ్యంలో జియో వైపు వినియోగదారులు ఆకర్షితులు అవ్వడం లేదు.