రిలయన్స్ జియో రాకతో టెలికాం సంస్థలన్నీ అతలాకుతలం అవుతున్నాయి..ఇప్పటికే జియో దెబ్బతో భారీ గా ఆఫర్స్ ప్రకటిస్తూ తమ కస్టమర్లను కాపాడుకునే పని లో పడ్డారు. ఈరోజు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ జియో దేశవ్యాప్త సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినియోగదారులకు భారీగా ఆఫర్స్ ప్రకటించారు. రిలయన్స్ జియో వెల్కమ్ పేరిట ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకూ రిలయన్స్ జియో పొందిన కస్టమర్లు ఫ్రీ డేటా, ఫ్రీ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చట. అంతే కాకుండా 75 జిబి కంటే ఎవరైతే ఎక్కువ డేటా ఉపయోగించుకుంటారో వారికి 1జిబి డేటాను 25 రూపాయలకే అందిస్తామని, రాత్రి పూట ఇంటర్నెట్ ఉపయోగించేవారికి అపరిమిత డేటాను ఉచితంగా అందించనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపాడు. ఈ ఆఫర్స్ తో ప్రజలంతా రిలయన్స్ జియో కోసం పరుగులు పెడుతున్నారు.