యాపిల్ తన ఐఫోన్ 16 సిరీస్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు మొదటి రోజు యాపిల్ స్టోర్‌కు బారులు తీరారు. అయితే ఇప్పుడు ఈ ఫోన్ తో కొన్ని సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఏ స్మార్ట్‌ఫోన్‌లోనైనా స్క్రీన్ కీలకం. చాలా కంపెనీలు టచ్ స్క్రీన్‌ను సాంప్రదాయ కీప్యాడ్‌తో భర్తీ చేశాయి. అయితే టచ్ పని చేయకపోతే ఎలా ఉంటుంది.. ఫోన్ టచ్ సరిగ్గా పని చేయకపోతే ఎక్స్ పీరియన్స్ బాగుండదు. ఐఫోన్ 16 ప్రో వినియోగదారుల విషయంలోనూ అదే జరిగిందని ఫిర్యాదులు వస్తున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలు మొదలు అయి వారం కూడా కాలేదు, వినియోగదారులు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. చాలా మంది వినియోగదారులు రెడ్డిట్ లో దీని గురించి ఫిర్యాదు చేస్తున్నారు. కొత్త కెమెరా కంట్రోల్‌కి సమీపంలో ఉన్న డిస్‌ప్లేపై వేలు లేదా బొటనవేలును మరో చేత్తో పోన్ పనిచేయడం లేదని చెబుతున్నారు.