Site icon TeluguMirchi.com

పబ్‌జీ అభిమానులకు చేదువార్త..

పబ్‌జీ లవర్స్ కు షాకింగ్ న్యూస్..మరికొద్ది రోజుల్లో పబ్‌జీ గేమ్ పున: ప్రారంభం అవుతుందని మొన్నటి వరకు వార్తలు ప్రచారం జరగడం తో గేమ్ లవర్స్ అంత ఆ రోజు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం మేరకు పబ్‌జీ తిరిగి సేవలను భారత్ లో తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పట్టేలాగా ఉంది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పబ్‌జీ కార్పొరేషన్ కి ఇంకా పూర్తీ స్థాయి అనుమతులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుతం నిషేధం విధించిన తర్వాత తిరిగి భారత్ లోకి “పబ్‌జీ మొబైల్ ఇండియా” పేరుతో గ్లోబల్ వెర్షన్ కి భిన్నంగా రావాలని ప్రయత్నిస్తుంది. గతంలో నిషేధింపబడ్డ సంస్థలు తమ వ్యాపార లావాదేవీల కోసం మన దేశంలో ఒక కొత్త సంస్థను ఫ్లోట్ చేసి తీసుకురావడం సరైన విధానం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. ఒక వేళా తిరిగి రావడం అంత సులభం అయితే ఇదే భాటలో టిక్ టాక్ కూడా తిరిగి వచ్చేదని, ఇది దేశ భద్రతకు సంబందించిన విషయం అని తెలిపింది.

Exit mobile version