రోల్స్ రాయిస్ .. లగ్జరీ కార్లకు పెట్టింది పేరు. ఇప్పుడీ బ్రాండ్ కొత్త మోడల్ వచ్చింది. రోల్స్ రాయిస్ ఎనిమిదో తరం ఫాంటమ్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ధర 9.50 కోట్ల రూపాయలు. దీనికి 6.75 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి12 ఇంజన్ అమర్చారు.
ఈ ఇంజన్ 563 హార్స్పవర్ శక్తిని, 900 ఎన్ఎం టార్క్ను అందిస్తుంది. 5.4 సెకండ్లలోనే జీరో నుంచి వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఈ కొత్త సీరీస్ కారు ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఫాంటమ్లతో పోల్చితే 30 శాతం తక్కువ బరువు వుంది.
భారత్లో తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఈ కారును విడుదల చేసినట్టు రోల్స్ రాయిస్ ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ పాల్ హారిస్ ప్రకటించారు. మరో లగ్జరీ కారు కలినన్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో మార్కెట్లోకి తీసుకువస్తామని చెప్పారు.