ప్రముఖ మొబైల్ సంస్థ మోటోరోలా నుండి వచ్చిన మోటో ఎక్స్4 ధరను తగ్గించి వినియోగదారులకు సంతోషం కలిగించింది. 3జీబీ , 4జీబీ , 6జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న వేరియంట్లలో, 3జీబీ ర్యామ్ మోడల్‌పై ధర తగ్గించినట్టు సంస్థ తెలిపింది. ముందుగా ఈ మోడల్ ధర రూ. 20,999 రూపాయలుగా ఉండగా ఇప్పుడు రూ.7000 తగ్గించి, రూ.13,999 లకే వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపింది.
మోటో ఎక్స్4 ఫీచర్స్ :
* డ్యూయల్ సిమ్(నానో)
* ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
* 5.2 అంగుళాల హెచ్డీ ఎల్టీపీఎస్ ఐపీఎస్ డిస్ప్లే
* కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 630 ఎస్ఓసీ
* 12 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరా
* 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు విస్తరణ మెమరీ
* 3000 ఎంఏహెచ్ నాన్-రిమూవబుల్ ఆల్-డే బ్యాటరీ