Site icon TeluguMirchi.com

సేవ్ బాలాజీ …!

lord-balajiతిరుపతి కొండమీద రోజుకొకటి గా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే బాలాజీ మీద జాలేస్తుంది . అందరి కోర్కెలూ తీర్చే ఏడుకొండల వాడికి ఈ దయనీయమైన పరిస్థితి ఏమిటనే బాధకలుగుతోంది . భక్తులకు కల్పతరువుగా భాసిల్లే ఆ దేవదేవుడు పాలకులకు కామధేనువుగా మారాడు . నోరుతెరిచి అడగలేని దేవుడి సొమ్మును నోరారా ఆరగిస్తున్నారు . అవినీతి … అపవిత్రం … అరాచకం … ఆశ్రితపక్షపాతం… అధికార దుర్వినియోగం .. లాంటివాటితో ఏడుకొండలు ఎరుపెక్కుతున్నాయి . కొండలు కదలవు కాబట్టి సరిపోయింది కానీ… లేకపోతే మన పెద్దలు వాటినికూడా లారిల్లోకి ఎక్కించి తరలించేవాళ్ళు. ..ఎంత నిస్సిగ్గుగా దోచుకుంటున్నారు..! ఆధ్యాత్మిక భావనతో , హైందవ ధార్మిక విశ్వాసాలతో ఎంత దారుణంగా ఆడుకుంటున్నారు . అసలు దేవుడిమీదే నమ్మకం లేని వాళ్ళని పాలకులుగా ప్రభుత్వం ఎలా నియమిస్తుంది ?అన్ని అకృత్యాలు జరుగుతున్నా…ఇంత దోపిడీ జరిగిపోతున్నా… భక్తుల మనోభావాలు ఇంతలా దెబ్బతింటున్నా … సర్కారు దున్నపోతుమీద వర్షం పడ్డట్టు చలనం లేకుండా ఎందుకు ఊరుకుంటోంది…? అంబానీలూ… విజయ మాల్యాలూ…ఆదికేశవులు నాయుడు గారికి ఆబ్లిగేషన్ కావచ్చేమోగానీ గర్భగుడిలో ఉన్న ఆ ఆది కేశవుడికి కాదుగదా . స్వామివారి పేరుపెట్టుకున్నందుకైనా ఆయన మీద చైర్మెన్ గారు జాలి చూపించవచ్చుగదా . ఎంతటి పావన క్షేత్రం…ఎంత పుణ్య స్థలం.. కోట్లాది భక్తుల కొంగు బంగారం … కొంత మంది పాలిట లంకెల బిందెలుగా మారిపొయాడు . ఉద్యోగుల్లో భయం లేదు..పాలకుల్లో చిత్తశుద్ధి లేదు …అర్చకుల్లో ఐక్యత లేదు … ప్రసాదాల్లో నాణ్యత లేదు… భక్తుల్లో భద్రతా భావం లేదు … కొండమీది అరాచకాలు చూస్తున్న ప్రతి భక్తుడి గుండె రగిలిపోతుంది. ఈ భగవదపచారాలకు అడ్డుకట్టవేయాలి . అవినీతి పరులను జైల్లో తోసి కఠినంగా శిక్షించాలి. ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులు తమ చిత్తశుద్ధితో ఏడుకొండలకు సంప్రోక్షణ చేయాలి. పాలక వ్యవస్థతోపాటు కొండ మీది అన్ని శాఖలనూ ప్రక్షాళన చేయాలి. లేకపోతే కొద్ది రోజుల్లోనే వేంకటేశ్వర స్వామిని కింగ్ ఫిషర్ విమానాల్లోకీ… రిలయన్స్ కౌంటర్లలోకీ… తరలించేస్తారు . హిందూ మతం కాబట్టి సరిపోయిందికానీ ఇదే మరో మతం లో జరిగితే… రెండు ప్రపంచ యుద్ధాలు జరిగి ఉండేవి .
సేవ్ బాలాజీ … సేవ్ హిందూయిజం … ప్రపంచ బాలాజీ భక్తులారా ఎకం కండి
ధర్మో రక్షతి రక్షితః …. ప్రస్తుతం దైవో రక్షతి రక్షితః ….

Exit mobile version