Site icon TeluguMirchi.com

ఫ్యాన్సో రక్షతి రక్షితః !

film crowdఇది ఎవరినో నిందించటం గాని, విమర్శించటం గానీ కాదు. ఎవరినో నొప్పించాలన్న ఉద్దేశ్యం కూడా నాకు లేదు. ఒక సినిమా వాడిగా నా స్పందనను రాయా లనిపించింది. రాస్తున్నా. ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఆ దర్శకుడు ఎంత జాగ్రత్తగా, బాధ్యతగా , ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎంత వళ్ళుదగ్గర పెట్టుకుని ఉండాలో ఇటీవలి పెద్ద సినిమాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. పరిస్తితిని చెప్పకనే చెబుతున్నాయి.

ఒక పెద్ద హిరో సినిమా వస్తోందంటే ఆ సినిమా నిర్మాతలు,డిస్త్రిబ్యుటర్లు, థియేటర్ల వాళ్ళు ఆర్టిస్టులు,టెక్నిషియన్లు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, ఎంతమంది జీవితాలు ఆధార పడిఉంటాయో తెలియనిదికాదు. వీటి గురించి నేను ప్రస్తావించబోవటంలేదు.పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఆ రేంజిలో వీళ్ళంతా నష్టపోతారు. కాని నేను చూస్తున్న కోణం అభిమానుల వైపు నుంచి… తమ అభిమాన హిరో సినిమా ఎప్పుడొస్తుందా అంటూ వేయి కళ్ళతో ఎదురుచుస్తూ గడిపే అభిమానులు మొదటిరోజునే ఆ సినిమా చూడాలని ఎంతగా ఎదురుచూస్తారొ అందరికీ తెలుసు.

తమ హీరోని ఎవరయినా ఏమయినా అంటే భరించలేరు.వాళ్ళతో కొట్లాడతారు. గొడవలు పెట్టుకుంటారు. సినిమా రిలీజుకు కొన్ని రోజులు ముందు నుంచి నిద్రపోరు…సరిగ్గా అన్నం తినరు. సినిమా గురించి ఎంతగానో ఉహించుకుని ఆకాశంలో తేలియాడుతుంటారు. రిలీజు రోజున పూజలు చేస్తారు.అన్నదానం చేస్తారు. ఇందుకోసం ఇంట్లో వస్తువులు అమ్మేస్తారు.అమ్మా నాన్నలకు తెలియకుండా దొంగతనం చేస్తారు. కుర్రాళ్ళు సెల్ ఫోన్లు అమ్మేస్తారు. మోటారు సైకిళ్ళు తాకట్టు పెడతారు. రిలీజు రోజున పదకొండు గంటలకు మొదటిఆట అయితే తెల్లవార కుండానే క్యూల్లో నించుంటారు. బయట కటవుట్లు,బ్యానర్లు,పూలదండలు, బాణ సంచా ఇలా ఎన్నో తమ హిరో మీద పిచ్చి అభిమానంతో ఖర్చు పెడతారు.

తాము ఎన్నో రకాలుగా ఊహించుకున్న సినిమా ఊహించని విధంగా నిరాశపరచటంతో వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం. బహుశా కోటానుకోట్లు నష్టపోయిన నిర్మాత కూడా ఇంతగా బాధకు గురికాడేమో. ఎవరో తమ సొంత మనిషి పోయినట్లు తమలో తామే కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. ఎవరినీ ఏమీ అనలేరు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్దపడతారు. చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తున్నా మంటే ఆ దర్శకుడు మిగిలిన వారికి జరిగే నష్టంతో బాటు అభిమానుల మానసిక క్షోభగూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏళ్లతరబడి సినిమాలు తీసి ఫ్లాపులు ఇస్తున్న కొందరు దర్శకులు సినిమాను ఆషామాషిగా కాకుండా మరింత బాధ్యతగా తీయా లనేది నా అభిప్రాయం.

ఎప్పుడో పరాయి భాషల నుంచి వచ్చి ఏదో సరదాగా సినిమాలు తీసి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వెళ్లి పోయే కొందరు దర్శకులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలి. అది ఏ భాష అయినా కావచ్చు. ఏ దర్సకుడయినా కావచ్చు. ఒక పెద్ద హిరో సినిమా ఫలితం ఆ నిర్మాత మీద, ఇతరుల మీద, ఆ హిరో ఇమేజ్ మీద ఎంతగా ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకించి ఆ హీరో అభిమానుల మీద ఎంతటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందో సదరు దర్శకులు సీరియస్ గా ఆలోచించుకోవాలి. ఇది ఎవరినో ఏ సినిమానో దృష్టిలో పెట్టుకుని చెబుతోంది కాదు. ఇటివల తమిళనాడు లో ఓ పెద్ద హిరో సినిమా దారుణంగా ఫ్లాప్ కావటంతో సదరు హిరో అభిమాని ఆత్మహత్య చేసుకున్న వార్త నా చేత ఈ వ్యాసం రాయించింది. దట్సాల్…

Exit mobile version