Site icon TeluguMirchi.com

బాలూ తరువాత ఎవరు ?

baluకొన్ని రంగాల్లో కొంతమంది తరువాత ‘ ఎవరు ‘ అన్న ప్రశ్నకు వెంటనే సమాధానం దొరకదు.ఓ ఎన్టీయార్ తర్వాత ‘ ఎవరు ‘ అన్న ప్రశ్న ప్రశ్నగానే ఇప్పటికి మిగిలిపోయింది. బహుశా కనుచూపు మేరలో సమాధానం దొరికే అవకాశం కూడా కనిపించటం లేదు. ఘంటసాల తరువాత బాలు ఆ స్థానాన్ని పూర్తిగా కాకపోయినా చాలావరకు భర్తీ చేశారు… ఘంటసాల తర్వాత బాలు అనే కీర్తిని స్వంతం చేసుకున్నారు. అందుకుగాను బాలు చేసిన కృషి సామాన్యమైనది కాదు. అయితే బాలు తరువాత ఎవరు అనే ప్రశ్నకు ఆన్సరు లేదు. ఘంటసాల, బాలు లాగా సుదీర్ఘకాల భవితవ్యాన్ని ప్రకటించుకున్న గాయకుడు కనిపించటం లేదు. వాళ్ళు ఇద్దరు సోలోగా కొన్ని దశాబ్దాలు తమ స్వంతం చేసుకున్నారు. కాని బాలు తరువాత ” గాయకుల సముదాయం ” తప్పితే ‘ సోలోగిరి ‘ అనే ప్రసక్తి లేదు. ఘంటసాల తరువాత బాలు అని కాన్ఫిడెంట్ గా చెప్పిన మనం ‘ బాలు తరువాత?’ అని అడిగితే టక్కున ఏ ఒక్క గాయకుడి పేరు చెప్పలేని పరిస్థితి…తరువాత వచ్చిన వారిలో ఎక్కువమంది పరభాషా గాయకులు..ఉదిత్ నారాయణ్, శంకర్ మహదేవన్, హరిహరన్ లాంటి గాయకులు వచ్చినా వాళ్ళు కొంత కాలానికే పరిమితమై పోయారు. మళ్లీ బాలు లాగా లాంగ్ కెరీర్ వున్న తెలుగు గాయకుడు కనపడకపోవటం విచారకరం. వచ్చిన వాళ్ళెవరు ఎక్కువ కాలం నిలబడలేక పోవటానికి కారణం అంతుబట్టటం లేదు…మహిళా గాయనీమణులలో కూడా ఇదే పరిస్థితి. చిత్ర గారి తరువాత కొంతకాలం పాటు ఉష రాజ్యమేలింది. కాని ఆ తరువాత మళ్లీ అదే పరిస్థితి…అయితే మగవాళ్ళ కంటే ఫిమేల్ సింగర్స్ ది కొంచెం బెటర్.సునిత, కౌసల్య లాంటి వాళ్ళు కాస్తో కూస్తో బండి లాగుతున్నారు.

అలాగే హీరోయిన్లలో సౌందర్య తరువాత కూడా ఇదే పరిస్థితి… టాలెంట్ లేకకాదు…నిలకడ లేక…చాలామంది ముంబాయి హీరోయిన్లు బాలివుడ్ లో అవకాశాలు దొరక్క అక్కడ ఎదిగేందుకు తెలుగు సినిమాను ఒక మెట్టులాగా వాడుకుంటున్నారు. ఇది ఎవరినీ విమర్శించటం కాదు.. ఏ రంగంలో అయినా రిప్లేస్ మెంట్ అనే దాన్ని గురించి మాట్లాడుకోవటం సహజం. దానికి ఫలానా వారు అనే బదులు ఫలానా వాళ్ళు అనే సమాధానం వస్తోంది. అయినా ఒక్కరే వుండాలన్నది రూలు కాదు.. ఎక్కువ మందికి అవకాశాలు రావటం మంచిదే…అవసరం కూడా. అయితే వచ్చిన అవకాశాలను వాళ్ళు ఎక్కువ కాలం నిలుపుకోలేక పోతున్నారనేది బాధ….కొంతమందిది స్వయంకృతం అయితే మరి కొంతమందిది జాతకం అని ఓ ఫ్రెండ్ అన్నాడు. అది నిజమేనేమో తెలియదు. అయితే అన్ని రంగాల్లోనూ మనవాళ్లకంటే పరాయి భాషల వారిని ప్రోత్సహించటం ఎక్కువైపోయింది కాబట్టి ఈ పరిస్థితి అని నా అభిప్రాయం.. తెలుగు టాలెంట్ ను మన పెద్దలు ప్రోత్సహిస్తే ఈ దౌర్భాగ్యం వుండదేమో…

Exit mobile version