Site icon TeluguMirchi.com

16న వస్తున్న ‘యుగానికి ఒక్క ప్రేమికుడు’

Yuganiki okka premikuduఆకాశ్ టైటిల్ పాత్ర పోషిస్తూ… దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యుగానికి ఒక్క ప్రేమికుడు’. ‘రహమత్ ప్రొడక్షన్స్ అధినేత ఖాదరవల్లి సమర్పణలో సుధా మూవీస్ పతాకంపై ఇ. బాబునాయుడు నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఓరియంటెడ్ లవ్ ఎంటర్ టైనర్ లో ఆకాష్ సరసన ‘కొత్త బంగారు లోకం’ ఫేమ్ శ్వేతాబసుప్రసాద్ నటించగా, ప్రముఖ నటుడు సుమన్ కీలక పాత్ర పోషించారు. తాగుబోతు రమేష్, ధనరాజ్, అదుర్స్ రఘు, కోట శంకరరావు, దినేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇళయరాజా తనయుడు కార్తీక్ రాజా సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర కథానాయకుడు మరియు దర్శకుడు ఆకాష్, చిత్ర సమర్పకులు ఖాదర్ వల్లిల లు చిత్ర విశేషాలు వెల్లడించారు. ముందుగా చిత్ర సమర్పకులు ఖాదర్ వల్లి మాట్లాడుతూ..’యుగానికి ఒక్క ప్రేమికుడు’ ఫస్ట్ కాపీ చూసి ఈ సినిమాను అవుట్ రైట్ గా తీసుకున్నాను. ఆకాష్ గారు ఎక్స్ ట్రార్డినరీగా సినిమాని రూపొందించారు. యాక్షన్ తో పాటు ఎంటర్ టైనమెంట్ కూ ఈ చిత్రంలో పెద్దపీట వేయబడింది. ఈనెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. చిత్ర కథానాయకుడు మరియు దర్శకుడు ఆకాష్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం అన్ని ఏరియాలూ బిజినెస్ అయిపోవడం చాలా సంతోషంగా ఉంది. నాతో ‘మిస్టర్ రాజేష్’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఖాదర్ వల్లికి ‘యుగానికి ఒక్క ప్రేమికుడు’ సినిమా చాలా బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని ఆయన అవుట్ రైట్ గా తీసుకున్నారు. నా మిత్రుడిగా నటించిన ధనరాజ్, నా ఫాదర్ గా నటించిన కోట శంకరరావులతో పాటు తాగుబోతు రమేష్, అదుర్స్ రఘుల పాత్ర చాలా బాగా వచ్చాయి’ అన్నారు. ఆకాష్ హీరోగ నటిస్తూ దర్శకత్వం వహించిన ‘యుగానికి ఒక్క ప్రేమికుడు’ చిత్రంలో తాము పోషించిన పాత్రలు తమకు మరింత గుర్తింపునిస్తాయని ధనరాజ్, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు, కోట శంకరరావు, దినేష్ అన్నారు.

Exit mobile version