తమిళ తంబీలకూ కథల కొరత వచ్చినట్టుంది. ఇక్కడి యావరేజ్ సినిమాల్నీ అక్కడకు తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు వారి దృష్టి…. ఎన్టీఆర్ బాద్షాపై పడింది. ఎన్టీఆర్-శ్రీనువైట్ల కలయికలో వచ్చిన చిత్రమిది. ఇక్కడ ఓ మాదిరి విజయాన్ని సాధించింది. అయితే… శ్రీనువైట్ల టేకింగ్ తమిళ జనాలను బాగా ఆకట్టుకొంది. ఈ సినిమాని ఇటీవల రజనీకాంత్ చూశారట. ‘భలే ఉంది.. బాగా తీశారు..’ అని బాద్షా యూనిట్‌ని మెచ్చుకొన్నారట. అంతే కాదు.. ఈసినిమా ధనుష్ చేస్తే బాగుంటుంది అన్నారట. మామ కోరితే అల్లుడు కాదంటాడా?? అందుకే ఈ సినిమా త్వరలోనే తమిళంలో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.