Site icon TeluguMirchi.com

ద‌ర్శకుడు ఎవ‌రు?

Akhil-Akkineniసిసింద్రీ అఖిల్ ఎంట్రీ దాదాపు ఖాయ‌మైనట్టే. వ‌చ్చే యేడాది అఖిల్ సినిమా ఉంటుంది అని నాగార్జున చూచాయిగా చెప్పేశారు. తెర వెనుక సిసింద్రీని హీరోని చేయ‌డానికి ప్రయ‌త్నాలూ ముమ్మర‌మ‌య్యాయి. ద‌ర్శకుడెవ‌ర‌నేది మాత్రం స‌స్పెన్స్‌గా మారింది. నాగ‌చైత‌న్యని స్టార్ ద‌ర్శకుడి చేతిలో పెట్టకుండా ఓ డెబ్యూకి ఇచ్చి – నాగ్ త‌ప్పు చేశాడు. జోష్ కాస్త నిర‌సంగా తీర్చిదిద్దాడు. అదే త‌ప్పు సిసింద్రీ విష‌యంలో చేయ‌డానికి నాగార్జున సిద్ధంగా లేడు. గత చ‌రిత్ర, అనుభ‌వం, ప్రతిభ రెండూ ఉన్న ద‌ర్శకుల లిస్టులో వినాయ‌క్‌, రాజ‌మౌళి, పూరి, శ్రీ‌నువైట్ల ఉంటారు. మ‌రి వీరిలో ఎవ‌రి చేతుల్లో అఖిన్ని పెడ‌తాడో చూడాలి. వీళ్లెవ‌ర‌కూ కాకుండా శేఖ‌ర్ క‌మ్ముల‌, శ్రీ‌కాంత్ అడ్డాల లాంటి సృజ‌నాత్మక ద‌ర్శకుల‌ను ఎంచుకొన్నా ఆశ్చర్యపోన‌వ‌స‌రం లేదు.

Exit mobile version