Site icon TeluguMirchi.com

తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదు : బాబు

NCBNతాను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రెండు సార్లు తెలంగాణ కోసం లేఖలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. తక్షణమే తెలంగాణపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాసినప్పటికీ, ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఎలాంటి స్పందన లేదని బాబు ధ్వజమెత్తారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్సేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కావాలనే కొన్ని పార్టీలు టీడీపీని బలహీనపర్చాలని కుట్ర చేస్తున్నారనీ, వారిని ప్రజలే నిలదీయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది ఒక్క టీడీపీయేనని ఆయన స్పష్టం చేశారు. సామాజిక న్యాయమంటూ ఆవిర్భవించిన ఓ పార్టీ ఏడాదిలోపే కాంగ్రెస్ లో కలిసిందని ఆయన పరోక్షంగా చిరంజీవిపై విమర్శలు గుప్పించారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి సామాన్యుడిపై భారం మోపిన కాంగ్రెస్ ను పార్టీ శ్రేణులు ,ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని బాబు విజ్ఞప్తి చేశారు. పేదవారికి ఇళ్లు కట్టించే బాధ్యత తమ పార్టీదేనని బాబు అన్నారు. మెదక్ జిల్లాలో బాబు రెండో రోజు వస్తున్నా మీ కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయని బాబు ఈ సందర్భంగా ప్రజలౌ భరోసా ఇచ్చారు.

 

Exit mobile version