వివాదం లో విజయ్ ..

తమిళ నటుడు విజయ్ సేతుపతి వివాదం లో చిక్కుకున్నాడు. మార్చి 17వ తేదీన ఓ ఛానెల్‌ కార్యక్రమంలో విజయ్‌ సేతుపతి హిందూ ఆలయాల్లో ఆగమ నియమాలను అనుసరించి చేసే కైంకర్యాలను కించపరుస్తూ మాట్లాడటంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అఖిల భారత హిందూ మహాసభ పేర్కొంది. వెంటనే విజయ్‌ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నగర పోలీసు కమిషనర్‌కు ఓ లేఖ కూడా పంపింది. మరోపక్క సోషల్ మీడియా లోను విజయ్ ఫై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.