రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ.
బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయ్యారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని నాగబాబు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. దీని ఫై సోషల్ మీడియా లో మెగా , నందమూరి ఫ్యాన్స్ వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ త్రిపురనేని విజయ్ చౌదరి నాగబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. డైరెక్టర్ విజయ్ చౌదరి సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని మహారథి మనవడు.. దర్శక నిర్మాత త్రిపురనేని చిట్టి తనయుడు. ‘కవ్వింత’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు నాగబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేసాడు.
విజయ్ చౌదరి మాట్లాడుతూ నాగబాబు సంపూర్ణేష్ బాబు అంత పెద్ద నటుడని.. ఇండస్ట్రీలో ఆర్టిస్ట్స్ అందరిని లైన్లో నిలబెడితే వెనకనుండి మొదట ఉండే మీరు బాలయ్య బాబుని అంటుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు అంటూ విరుచుకుపడ్డాడు. నువ్వు చిరంజీవి తమ్ముడివి కాకపోతే.. పవన్ కళ్యాణ్ అన్న వి కాకపోతే మీకు అసలు గుర్తింపే లేదు.. అంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా నువ్వు ఇండస్ట్రీకి చేసిన గొప్ప ఏంటి.. బాలయ్య బాబుని పిలవకుండా మీటింగ్స్ జరిపే అంత కెపాసిటీ ఉందా మీకు.. మీ అన్న చిరంజీవి కూడా హీరో మాత్రమే.. ఇండస్ట్రీ మొత్తం మీ ఫ్యామిలీది అనుకుంటున్నారా.. బాలయ్య బాబుని మీటింగుల పిలవాల్సిన భాద్యత మీది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. బాలయ్యని నువ్వేమి కింగ్ కాదు అంటున్నావ్.. నువ్వేమన్నా కింగా.. మీ అన్నా తమ్ముడు కింగ్ లు అనుకుంటున్నారా.. మీలాగా బాలయ్య మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకటి చెప్పేవాడు కాదు అంటూ విమర్శించాడు. ఇంకేమన్నాడో ఆయన మాటల్లోనే వినండి.