Vijay Devarakonda : తమిళ్ లో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీ రికార్డ్..


తెలుగులో స్టార్ హీరోగా ప్రేక్షకుల అభిమానం పొందిన విజయ్ దేవరకొండ తమిళనాట కూడా తన క్రేజ్ చూపిస్తున్నారు. ఒక్కో సినిమాతో కోలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ సినిమా తమిళనాట హయ్యెస్ట్ కలెక్టెడ్ నాన్ తమిళ్ మూవీగా నిలవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘ఖుషి’ గతేడాది తమిళనాట 12 కోట్ల రూపాయలకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ దక్కించుకుంది. షారుఖ్, నయనతార, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ తర్వాత స్థానం ‘ఖుషి’నే సంపాదించుకుంది. ‘ఖుషి’ తర్వాతి స్థానాల్లో సలార్, యానిమల్ సినిమాలున్నాయి. విజయ్ జోడీగా సమంత నటించిన ‘ఖుషి’ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ బిగ్ బ్లాక్ బస్టర్స్ లో ‘ఖుషి’ ఒకటిగా నిలిచింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

Also Read :  Vijay Devarakonda : రెట్రో మూవీ ఈవెంట్ లోని తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ