Site icon TeluguMirchi.com

Family Star Teaser : ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్.. కలియుగ రాముడిగా విజయ్ దేవరకొండ !


స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

గోపీ సుందర్ కంపోజ్ చేసిన ‘దేఖొరో దెఖో..’ సాంగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ను వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంది. సర్ నేమ్ కు సరెండర్ అయి, ఫ్యామిలీ అంటే వీక్ నెస్ ఉన్న కలియుగ రాముడిగా హీరో విజయ్ దేవరకొండను ఈ టీజర్ లో చూపించారు. దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుంటూ, తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటుంటాడు హీరో. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మడత పెట్టి కొడతాడు. టీజర్ చివరలో హీరోయిన్ మృణాల్ ‘నేను కాలేజ్ కు వెళ్లాలి. కొంచెం దించేస్తారా..’ అని అడిగితే.. ‘లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ అంటాడు హీరో. ఫ్యామిలీ, క్లాస్, మాస్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటుంది.

Family Star Teaser - Vijay Deverakonda | Mrunal Thakur | Parasuram | Dil Raju | Gopisundar

Exit mobile version