Site icon TeluguMirchi.com

బాల‌య్యతో విద్యాబాల‌న్‌..?

balakrishna vidhyabalanనంద‌మూరి బాల‌కృష్ణ సినిమా రూల‌ర్ కోసం క‌థానాయికల వేట కొన‌సాగుతూనే ఉంది. టాలీవుడ్ అంతా గాలించినా బాల‌య్య ప‌క్కన భామ కనిపించ‌లేదు. ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టారు. అక్కడ బాల‌కృష్ణ కు స‌రిప‌డ క‌థానాయిక‌లెవ‌రా..? అని ఆరా తీస్తున్నారు. విద్యాబాల‌న్ పేరు ప‌రిశీల‌న‌లోఉంద‌ని తేలింది. అభిన‌యం, అందం…. క‌ల‌గ‌లిసి – బాల‌య్య ప‌క్కన స‌రిగ్గా స‌రిపోవాల‌ట‌. ఆ ల‌క్షణాలు విద్యాబాల‌న్‌లోనే ఉన్నాయ‌ని రూల‌ర్ టీమ్ భావిస్తోంది. మ‌రి విద్య అందుకు ఒప్పుకొంటోందా? ఒక వేళ విద్యాబాల‌న్ నో చెప్పిన ప‌క్షంలో మ‌రో ఆప్షన్ ఏమిటి? బాల‌య్య కెరీర్‌లో ఇప్పటి వ‌ర‌కూ క‌థానాయిక‌ల స‌మ‌స్య త‌లెత్తలేదు. ఏమిటో ఇది కొత్తగా..?!

Exit mobile version