రానా లవ్ వెనుక వెంకటేష్ పెద్ద కుమార్తె పాత్ర పెద్దదే

భల్లాల దేవా ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతుండడం తో అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా లో తన పెళ్లి కబురు చెప్పడం ఆలస్యం రానాకు అంత విషెష్ అందించారు.

రీసెంట్ గా రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది. ఇక పెళ్లి ఎప్పుడు అనేది అందరిలో చర్చ గా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆగస్ట్ 8న హైదరాబాద్ లో రానా – మిహీకల పెళ్లి జరగబోతోందనిఅంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ వీరి ప్రేమ వెనుక వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత పెద్దదే అంటున్నారు. ఆశ్రితకు మిహీక క్లాస్ మేట్. చిన్నప్పటి నుంచి క్లోజ్. అలా సోదరి వల్లనే మిహాక రానాకు పరిచయం అయ్యిందిట. ఇంతకుముందు ఆశ్రిత పెళ్లి వేడుకలోనూ మిహీక సందడి చేసింది. ఆ క్రమంలోనే రానా స్నేహం బాగా కుదిరిందట. ఇప్పటికి ప్రేమ పరిమళించి పెళ్లి వరకూ వచ్చిందని అంటున్నారు.