Site icon TeluguMirchi.com

మల్టీ స్టారర్స్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారిన వెంకటేష్…?

విక్టరీ వెంకటేష్ కథ నచ్చితే మల్టీ స్టారర్స్‌ లో నటించడానికి ఎప్పుడూ సిద్ధమని మరోసారి నిరూపించాడు. ప్రస్థుతం తుదిదశకు చేరుకున్న మల్టీ స్టారర్‌ “సీతమ్మ వాకిట్లో…” మహేష్ తో కలిసి చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే మరో మల్టీస్టారర్‌ కు పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. హిందీలో హిట్ అయిన ‘బోల్ బచ్చన్’ సినిమాను తెలుగులో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సినిమాలో అజయ్ దేవగన్ పోషించిన పాత్రను వెంకటేష్, అభిషేక్ బచ్చన్ పాత్రను రామ్ చేయనున్నారు. వెంకటేష్ స్వయంగా ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. డి.సురేష్‌బాబు, ‘స్రవంతి’ రవికిషోర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. గతంలో వీరిద్దరూ కలిసి నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ మాదిరి ఘన విజయం సాధించే దిశగా తాజా సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బోల్ బచ్చన్’కు తెలుగు వెర్షన్ పేరును, దర్శకుడు ఎవరన్నది కూడా ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది.

Exit mobile version