Site icon TeluguMirchi.com

బీజేపీ అధ్యక్షుడిగా వెంకయ్య ?

భారతీయ జనతాపార్టీ అధ్యక్ష పదవి డోలాయమానంలో పడింది. ప్రస్తుత అధ్యక్షుడు గడ్కరీ పై అవినీతి ఆరోపణలు రావడంతో బీజీపీ, ఆర్‌.ఎస్‌.ఎస్‌ లు డైలమాలో పడ్డాయి. ఆరోపణలు వెల్లువెత్తిన క్షణం గడ్కరీని మార్చితే తమ వ్యతిరేక పార్టీలకు బలం చేకూర్చినట్లవుతుందని ఇన్నాళ్ళూ భావించినట్లున్నారు. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కుంభకోణాల్లో చిక్కుకుని అభాసుపాలైయారు. కాంగ్రెస్ అవినీతి వ్యవహారాలపై దుమ్మెత్తి పోస్తున్న సమయంలో గడ్కరీ అవినీతి బట్టబయలవడంతో దిక్కుతోచని స్థితిలో బీజేపే కొట్టుమిట్టాడుతోంది. ఈ స్థితిలో గడ్కరీని తప్పించని పక్షంలో రానున్న ఎన్నికలలో కడిగిన ముత్యంలా ప్రజల ముందుకు వెళ్ళలేక పోయినా, కనీసం బీజీపీ అధ్యక్షున్నయినా మార్చాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడు సమర్థంగా , నీతివంతంగా వ్యవహరించిన చరిత్ర ఉంది. వివాదరహితుడిగా పేరొందిన వెంకయ్యనాయుడిని మళ్లీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని ఇటు బీజేపీతో పాటు, అటు ఆర్‌.ఎస్‌.ఎస్‌ లు సుముఖంగా ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి. డిసెంబరులో జరిగే బీజేపీ జాతీయ మండలి సమావేశంలో గడ్కరీని సాగనంపి వెంకయ్యను అందలం ఎక్కించవచ్చని భావిస్తున్నారు.

Exit mobile version