అంద‌గాడు వ‌స్తున్నాడు

varun tejమెగా కుటుంబం నుంచి మ‌రో హీరో వ‌స్తున్నాడు. త‌నే… నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్‌. చ‌ర‌ణ్‌ని చిరుత‌గా చూపించి ఘ‌న‌మైన బోణీ ఇచ్చిన పూరి జ‌గ‌న్నాథ్‌… వ‌రుణ్ తేజ్ బాధ్యత కూడా తీసుకొన్నాడు. ఈ చిత్రానికి అశ్వనీద‌త్ నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్టు పనులు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి అంద‌గాడు అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. పూరి టైటిళ్లు దాదాపుగా నెగిటీవ్‌గా ఉంటాయి. ఇడియ‌ట్‌, పోకిరి, దేశ‌ముదురు- ఇలా తిట్టే టైటిళ్లుగా పెడ‌తారు. అంద‌గాడు అంటూ పాజిటివ్ పేరు పెట్టడం చాలా అరుదే!  మ‌రి ఈ ట్రెండ్ అత‌నికి ల‌క్ తీసుకొస్తుందో లేదో చూడాలి.