Site icon TeluguMirchi.com

వ‌ర్మ… సైకో!

ramgopal-varmaవ‌ర్మ ద‌ర్శకుడి కంటే నిర్మాత‌గానే స‌క్సెస్ అవుతున్నాడీ మ‌ధ్య‌. ఎన్ని ఫ్లాప్‌లు తీసినా వ‌ర్మ అనే బ్రాండ్ ఇప్పటికీ ఉంది. వర్మ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే ఇప్పటికీ ప్రేక్షకులు, ప‌రిశ్రమ ఆస‌క్తిగానే ఎదురుచూస్తోంది. దాన్నే బాగా క్యాష్ చేసుకొంటున్నాడు వ‌ర్మ‌. త‌క్కువ బ‌డ్జెట్‌లో ఓ సినిమా తీసి జ‌నాల మీద‌కు వ‌దిలేస్తున్నాడు. వ‌ర్మ పేరు మీద ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ, అవ‌స‌ర‌మైతే నాలుగైదు భాష‌ల్లో మార్కెట్ జ‌రిగిపోతోంది. ఒక్కోచోట నాలుగు కోట్లకు సినిమా అమ్ముకొన్నా – బోలెడంత సొమ్ము చేసుకోవ‌చ్చు. శాటిలైట్ హ‌క్కులు ఎలాగూ వ‌స్తాయి. ఇప్పుడు ఇదే సినిమాతో సైకో అనే సినిమా తీశాడు వ‌ర్మ‌. కిషోర్ భార్గవ్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ చిత్రానికి క‌థ‌, స్ర్కీన్ ప్లే వ‌ర్మనే అందించాడు. కిషోర్ వ‌ర్మ శిష్యుడు కాదు. కానీ టాలెంట్ ప‌సిగ‌ట్టి త‌న ద‌గ్గరున్న క‌థ‌ను ఇచ్చేశాడ‌ట‌. ఈనెల 21న ఈ చిత్రం విడుద‌ల చేస్తున్నారు. మ‌రి వ‌ర్మ ప్లాన్ ఎంత వ‌ర‌కూ వ‌ర్కవుట్ అయ్యిందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాలి.
Exit mobile version