Site icon TeluguMirchi.com

ఇండస్ట్రీ గురించి మరో బాంబ్ పేల్చిన వర్మ

వర్మ అంటేనే సంచలనం..ఎప్పుడు ఎవరి మీద వివాదం తెరలేపుతారో ఆయనకే తెలియదు..అందుకే ఆయన చేసే కామెంట్స్ కోసం అంత ఆసక్తి గా ఎదురుచూస్తుంటారు. కాగా వారం రోజులుగా ఇండస్ట్రీ లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఫై పెద్ద చర్చ జరుగుతుంది. కొంతమంది ఈ వివాదాన్ని సద్దుమణిగేలా ట్రై చేస్తుంటే..మరికొంతమంది మాత్రం వివాదాన్ని ఇంకాస్త వివాదం చేస్తున్నారు.

ఇక్కడ ఎవరి కుంపటి వాళ్లదే. కళామతల్లి ఒడిలో అందరూ ఒకటి కావడం జరగనిది. ఇక్కడ వేరు వేరు సినిమాలు వేరు వేరు ప్రాజెక్టులు. ఒకరంటే మరొకరికి పడదు అని అన్నారు ఆర్జీవీ. కలిసి పని చేద్దామని పెట్టే మీటింగులన్నీ వృధానే. కాఫీ టీలు తాగడం తప్ప నిర్ణయం తీసుకోలేరని దెప్పి పొడిచారు.

Exit mobile version