ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అమెరికాలో స్థిరపడిన ఉమాపతిరావు కుమార్తె శోభ ఇండియాకు రావడం ఆలస్యం కావడంతో అంత్యక్రియలు చేయడం ఆలస్యం అయింది. ఈరోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు గడికోటలో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ కార్యక్రమానికి ఉపాసన.. రామ్ చరణ్.. చిరంజీవి కూడా హాజరయ్యారు.
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో చిరంజీవి.. ఆయన పక్కన ఉన్న మరి కొందరిపై తేనేటీగలు దాడి చేశాయి. అక్కడ ఉన్న స్టాఫ్ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం లక్ష్మీ బాగ్ కు భౌతిక దేహాన్ని తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.