మెగాస్టార్ చిరంజీవి కోడలు , రామ్ చరణ్ భార్య ఉపాసన..సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఒంటి సామాజిక అంశాల పట్ల ఎప్పుడు స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఓ గొప్ప పనిచేయబోతున్నట్లు తెలిపింది. మధ్యతరగతి వారి కోసం అనుకూలమైన హెల్త్‌కేర్ పాలసీ ని స్టార్ట్ చేయబోతుంది.
బీమా కంపెనీలు, ప్రభుత్వంతో కలిసి మధ్య తరగతి వారికి ఉపయోగపడే హెల్త్‌కేర్ కవరేజ్ మోడల్‌ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన ట్వీట్ చేశారు.
‘అందరికి అనువైన ఆరోగ్య సంరక్షణ.. 50 కోట్ల మంది భారతీయులకు అనువైన ఉత్తమమైన హెల్త్‌కేర్ కవరేజ్ నమూనాను అభివృద్ధి చేయడానికి బీమా సంస్థలు, ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేసస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలపడమే కాక ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. జై హింద్’ అంటూ ఉపాసన ట్వీట్ చేయడమే కాక ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో ‘దాదాపు 50 కోట్ల మంది భారతీయులు ఆరోగ్య సమస్యల వల్ల పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. అందరికి అనువైన హెల్త్‌కేర్ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నాం’ అంటూ ఇన్యూరెన్స్ కంపెనీ ఎఫ్‌హెచ్‌పీఎల్‌ని ట్యాగ్ చేశారు ఉపాసన. 65 లక్షల మందికి ఆరోగ్య సేవలను కల్పించే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్‌లో భాగసస్వామ్యం కావడం గర్వంగా ఉంది’ అన్నారు.