Site icon TeluguMirchi.com

అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు

కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. అయితే, స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు తెరవడంపై ఉన్న నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు కంటైన్మెంట్ జోన్ల బయట కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులతో కూడిన అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమలు కానున్నాయి.

స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్‌ కేంద్రాలను ఇప్పుడే తెరిచేది లేదని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. ఆగస్టు 31 వరకు వీటిపై ఉన్న నిషేధం యథాతథంగా అమలౌతుందని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, బార్లు, ఆడిటోరియాలు వంటివి తెరవడంపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది.

Exit mobile version