Site icon TeluguMirchi.com

“ఉలవచారు బిర్యానీ” ….. లవ్ ఈజ్ కుకింగ్

ప్రకాష్ రాజ్.. వైవిధ్యమైన నటుడే కాదు, టేస్ట్ ఉన్న దర్శక నిర్మాత అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇటీవలే తన స్వీయదర్శకత్వంలో ధోనీ చిత్రాన్ని తెరకెక్కించి తన తపనను చాటి చెప్పాడు. ఇప్పుడు మరో చిత్రంతో మన ముందుకి రాబోతున్నట్టు తెలిసింది. గత సంవత్సరం మళయాళంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం “సాల్ట్ అండ్ పెప్పర్” రీమేక్ హక్కులు తన సొంతం చేసుకున్నాడు. మళయాళ మాతృకలో మోహన్ లాల్, శ్వేతా మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. దీని తెలుగు రీమేక్ వెర్షన్ కు “ఉలవచారు బిర్యానీ” అని నామకరణం చేసినట్టు సమాచారం. మరి ఈ ఉలవచారుకు రుచులందిస్తున్న భామగా టబు ఎంపికయింది. మరో ముఖ్యపాత్రలో యామీ గౌతం నటించనుంది. హీరోగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్న ఈ “ఉలవచారు బిర్యానీ” కి ‘ లవ్ ఈజ్ కుకింగ్ ‘ అన్న ట్యాగ్ లైన్ తగిలించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రానికి సాహిత్యం సిరివెన్నెల అందించనుండగా సంగీత బాధ్యతలు ఇళయరాజా స్వీకరించారట. అంతేకాదండోయ్, ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్రకాష్ భావిస్తున్నట్టు వినికిడి.

Exit mobile version