Site icon TeluguMirchi.com

ఉదయ్ కిరణ్ ఫస్ట్ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో అయినా వ్యక్తి ఉదయ్ కిరణ్. చిత్ర సీమలో వారసుల ఎంట్రీ తప్ప మరొకరి హీరో అయ్యే ఛాన్స్ తక్కువ అనే నేపథ్యంలో ఉదయ్ ఎంట్రీ ఇచ్చి టాప్ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజ డైరెక్షన్లో చిత్రం మూవీ ద్వారా హీరో అయ్యాడు.

ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, నీ స్నేహం, కలుసుకోవాలని లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. కానీ వెంటనే కెరీర్‌లో కొన్ని ఒడిదుడుకులు.. ఆ తర్వాత కుదుపులు.. అవకాశాలు సన్నగిల్లడం.. పర్సనల్‌ లైఫ్‌లో కూడా కొన్ని సమస్యలు రావడంతో 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్.

2000 ఏడాదిలో ఉదయ్ నటించిన చిత్రం సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నాడనేది తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ సినిమాకు తనతో పాటు చాలా మంది కొత్తవాళ్లు పని చేసామని.. ఆ కోసం తనతో పాటు ఉదయ్ కిరణ్, రీమా సేన్ ఇలా అందరికీ రామోజీ రావు 11 వేలు పారితోషికంగా ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు తేజ.

Exit mobile version