ఉద‌య‌భాను ఆ టైపా??

udaya-bhanuప్రస్తుతం వేశ్య పాత్రల సీజ‌న్ న‌డుస్తోంది. హాట్ భామ‌లంతా వేశ్య పాత్రల‌పై మోజు పెంచుకొంటున్నారు. ఛార్మి, శ్రియ‌, వేద‌, శ్రుతిహాస‌న్‌, వీణామాలిక్‌… ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. ఈ జాబితాలో ఉద‌య‌భాను కూడా చేరిపోయిందా?? మ‌ధుమ‌తి ప్రచార చిత్రాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఉద‌య‌భాను క‌థానాయిక‌గా నటిస్తున్న చిత్రమిది. చిత్రబృందం చెప్పడం లేదు గానీ… ఇందులో ఉద‌య‌భానుని వేశ్య పాత్రలానే అనిపిస్తోంది. వెండి తెర‌.. ఈ యాంక‌ర‌మ్మకు కొత్త కాదు. కొండ‌వీటి సింహాస‌నం, లీడ‌ర్‌, జులాయి సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో న‌టించింది. క‌థానాయిక‌గా ప్రమోష‌న్ పొంద‌డం ఇదే తొలిసారి. తొలి అడుగే.. వేశ్య పాత్ర చేస్తోందంటే నిజంగా ఆమె గ‌ట్స్‌ని అభినందించాల్సిందే.